రాజకీయ పార్టీ పేరు ప్రకటించిన సినీ నటుడు విజయ్‌

Vijay: తమిళగ వెట్రి కళగం పేరిట పార్టీ ప్రకటన

Jyothi
Published on: 2 Feb 2024 1:55 PM IST
Thalapathy Vijay Announced the Name of his Political Party Tamilaga Vettri Kazhagam
X

రాజకీయ పార్టీ పేరు ప్రకటించిన సినీ నటుడు విజయ్‌

Vijay: తమిళనాడులో మరో కొత్త పొలిటికల్ పార్టీ ఎంటర్ అవ్వబోతుంది. అయితే రాజకీయ అరంగ్రేటం చేసేది మరో తమిళ సినీ నటుడు. తమిళగ వెట్ర కళగం పేరిట పొలిటికల్ పార్టీ ప్రకటించారు సినీ నటుడు విజయ్. పార్టీ జెండా, ఎజెండా త్వరలోనే ప్రకటిస్తానని ట్వీట్ చేశారు విజయ్. సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలు.. పొలిటికల్ పవర్‌తోనే సాధ్యమంటూ ఆయన ప్రకటించారు.

అయితే విజయ్ పొలిటికల్ ఎంట్రీపై చాలా రోజులుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎట్టకేలకు పొలిటికల్ ఎంట్రీని కన్ఫామ్ చేశారు విజయ్. అయితే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి మద్దతివ్వడం లేదని ఆయన ప్రకటించారు. అవినీతి నిర్మూలన కోసం తమ ప్రయత్నమంటూ స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు విజయ్. 2026లో తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు టార్గెట్‌గా తమ టార్గెట్ అంటూ ప్రకటించారు విజయ్.

Jyothi

Jyothi

Next Story