Jammu & Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం

*శ్రీనగర్‌లోని పాఠశాలలో టెర్రరిస్టుల కాల్పులకు ఇద్దరు ఉపాధ్యాయులు మృతి

Shilpa
Updated on: 7 Oct 2021 2:30 PM IST
Terrorists Gun Fire at Government School of Srinagar in Jammu & Kashmir | National News Today
X

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం(ఫైల్ ఫోటో)

Jammu & Kashmir: జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉగ్రవాదులు ఇద్దరు ప్రభుత్వ టీచ‌ర్లను చంపేశారు. దాంట్లో ఓ మ‌హిళ టీచ‌ర్ ఉంది. ఒక‌రు క‌శ్మీరీ పండిట్ కాగా, మ‌రొక‌రు సిక్కు మ‌హిళ‌గా గుర్తించారు. శ్రీన‌గ‌ర్ జిల్లాలోని సంఘం ఈద్గా వ‌ద్ద ఇద్దరు స్కూల్ టీచ‌ర్లను కాల్చి చంపారు ఉగ్రవాదులు. ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతాన్ని మూసివేశామ‌ని, ఉగ్రవాదుల కోసం అన్వేషిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నేష‌న‌ల్ కాన్ఫరెన్స్ నేత‌, మాజీ సీఎం ఒమ‌ర్ అబ్దుల్లా టీచ‌ర్ల హ‌త్య ఘ‌ట‌న‌ను ఖండించారు. అనాగ‌రిక చ‌ర్యకు టీచ‌ర్లు బ‌ల‌య్యార‌ని, వారి ఆత్మకు శాంతి చేకూర్చాల‌ని ప్రార్థిస్తున్నట్లు ఒమ‌ర్ ట్వీట్ చేశారు. మంగ‌ళ‌వారం ఉగ్రవాదులు ఓ క‌శ్మీరీ పండిట్‌ను చంపేశారు. శ్రీన‌గ‌ర్‌లోని ఇక్బాల్ పార్క్‌లో ఉన్న ఓ ఫార్మసీ షాపు ఓన‌ర్ 70 ఏళ్ల మ‌ఖ‌న్ లాల్ బింద్రూను ఉగ్రవాదులు కాల్చి చంపారు.


Shilpa

Shilpa

Next Story