Terrorists Attack on Assam rifles Soldiers: మణిపూర్‌లో ఉగ్ర‌దాడులు.. ముగ్గురు జవాన్లు మరణం

Terrorists Attack on Assam rifles Soldiers: మణిపూర్‌లో ఉగ్రవాదులు దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. పీపుల్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు అస్సాం రైఫిల్స్‌ యూనిట్‌కు చెందిన భద్రతా బలగాలపై మెరుపు దాడి చేశారు.

Karampoori Rajesh
Published on: 30 July 2020 1:42 PM IST
Terrorists Attack on Assam rifles Soldiers: మణిపూర్‌లో ఉగ్ర‌దాడులు.. ముగ్గురు జవాన్లు మరణం
X
soldiers of Assam Rifles killed

Terrorists Attack on Assam rifles Soldiers: మణిపూర్‌లో ఉగ్రవాదులు దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. పీపుల్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు అస్సాం రైఫిల్స్‌ యూనిట్‌కు చెందిన భద్రతా బలగాలపై మెరుపు దాడి చేశారు. భద్రతా బలగాలపై ఐఈడీ దాడులతో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా జవాన్లపై కాల్పులకు కూడా దిగారు. ఈ ఘటనలో ముగురు జవాన్లు అమరులు కాగా... మరో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటన రాజధాని ఇంఫాల్ నుంచి 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న చందేల్ జిల్లాలో జరిగింది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story