Terror Attack: జమ్ముకశ్మీర్‌ శ్రీనగర్‌లో ఉగ్రదాడి

* SKIMS ఆస్పత్రిలో చొరబడ్డ టెర్రరిస్టులు * ఆస్పత్రి సిబ్బందిని అడ్డుపెట్టుకుని పరారైన టెర్రరిస్టులు

Sandeep Reddy
Updated on: 5 Nov 2021 9:00 PM IST
Terror Attack in Srinagar SKIMS Hospital
X

జమ్ముకశ్మీర్‌ శ్రీనగర్‌లో ఉగ్రదాడి (ఫైల్ ఫోటో)

Srinagar: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గత కొంతకాలంగా భారత ఆర్మీ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారీ ఆపరేషన్ చేస్తోంది. ఇవాళ కూడా ఉగ్రవాదుల ఏరివేత కొనసాగిస్తుండగా టెర్రరిస్టులు ఎదురుపడ్డారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన సైన్యం కాల్పులు జరిపింది. శ్రీనగర్‌లోని బెమీనాలోని స్కిమ్స్ మెడికల్ కాలేజీ దగ్గర ఘటన జరగడంతో ఉగ్రమూకలు ఆస్పత్రిలోకి వెళ్లి నక్కినట్లు అధికారులు తెలిపారు.

కాసేపటికే ఇండియన్ ఆర్మీ ఆస్పత్రిని చుట్టుముట్టింది. ఈ క్రమంలో ఆస్పత్రి సిబ్బందిని అడ్డుపెట్టుకుని ఉగ్రవాదులు తప్పించుకున్నారు. తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం భారత సైన్యం ముమ్మరంగా గాలిస్తోంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story