Kerala: కేరళలోని మలప్పురంలో ఘోర ప్రమాదం.. 20మంది మృతి

Kerala: సహాయక చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం

Dhatripriya
Updated on: 8 May 2023 7:22 AM IST
Terrible Accident In Malappuram Kerala
X

Kerala: కేరళలోని మలప్పురంలో ఘోర ప్రమాదం.. 20మంది మృతి

Kerala: కేరళలోని మలప్పురంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బోటు బోల్తా పడిన ఘటనలో 20మంది చనిపోయారు. వారిలో చాలామంది చిన్నారులు ఉన్నట్లు తెలిసింది. 30మందితో వెళ్తున్న బోటు తువల్తిరమ్ తీరంలోని తానూర్ ప్రాంతంలో మునిగిపోయింది. అగ్నిమాపక, పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద విషయం తెలుసుకున్న ప్రధాని మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు 2లక్షల పరిహారం ప్రకటించారు. అత్యవసర చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి పినరయి విజయ్ మలప్పురం జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

Dhatripriya

Dhatripriya

Next Story