Sabarimala: పళనిలో టెన్షన్ వాతావారణం.. తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారుల దాడి

Sabarimala: పళనిలో టెన్షన్ వాతావారణం.. తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారుల దాడి
x
Highlights

Sabarimala: శబరిమలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగురాష్ట్రాల నుంచి దర్శనానికి వెళ్లిన కొందరు అయ్యప్ప భక్తులు, స్థానిక దుకాణాదారుల మధ్య జరిగిన వాగ్వాదం ఉద్రిక్తతలకు దారితీసింది.

Sabarimala: శబరిమలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలుగురాష్ట్రాల నుంచి దర్శనానికి వెళ్లిన కొందరు అయ్యప్ప భక్తులు, స్థానిక దుకాణాదారుల మధ్య జరిగిన వాగ్వాదం ఉద్రిక్తతలకు దారితీసింది. ఓ షాపులో వాటర్ బాటిల్ ధరపై భక్తులు ప్రశ్నించగా.. ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన తెలిసిన వెంటనే అక్కడ ఉన్న ఇతర తెలుగు భక్తులు కూడా ఆ షాపుకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అక్కడికి చేరుకుని భక్తులను, వ్యాపారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయితే కొందరు భక్తులు పోలీసుల చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories