ఆలయ ఉత్సవాల్లో అపశృతి.. రథోత్సవంలో ఒక్కసారిగా కుప్పకూలిన రథం

Temple Chariot Overturns In Pudukkottai Tamil Nadu
x

ఆలయ ఉత్సవాల్లో అపశృతి.. రథోత్సవంలో ఒక్కసారిగా కుప్పకూలిన రథం

Highlights

Tamil Nadu: తమిళనాడు పుదుకోట్టై ఆలయ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది.

Tamil Nadu: తమిళనాడు పుదుకోట్టై ఆలయ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఆలయ ఉత్సవాలలో భాగంగా నిర్వహించే రథోత్సవంలో రథంపైనున్న కుటీరం ఊడి పడింది. వందల సంఖ్యలో భక్తులు రథం లాగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు గాయపడగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆదిపురలోని పురాతన ప్రగడాంపాల్ తిరుగోకర్ణేశ్వరర్ ఆలయంలో రథోత్సవం రెండేళ్ల తర్వాత జరుగుతోంది. దీంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా రథోత్సవంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అంగ రంగ వైభవంగా రథోత్సవం ప్రారంభం‌ కాగా ఈ అపశృతి చోటు చేసుకుంది. రెండు క్రేన్ల సాయంతో నేలకొరిగిన రథంపై కప్పును పైకి తీసి ప్రజలను కాపాడారు.

Show Full Article
Print Article
Next Story
More Stories