అగ్రరాజ్యంలో అధ్యక్ష పదవి ఎన్నికల కాక.. కీలకం కానున్న తెలుగువారి ఓట్లు

అగ్రరాజ్యంలో అధ్యక్ష పదవి ఎన్నికల కాక.. కీలకం కానున్న తెలుగువారి ఓట్లు
x
Highlights

అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష పదవి ఎన్నికలు కాక రేపుతున్నాయి. రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌, డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ మధ్య ఉత్కంఠ పోరు...

అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష పదవి ఎన్నికలు కాక రేపుతున్నాయి. రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌, డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ మధ్య ఉత్కంఠ పోరు నెలకొంది. ఇప్పటికే ఇద్దరూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. హామీలను ఇస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. నవంబర్‌ 3న జరిగే ఈ ఎన్నికల్లో తెలుగువారి ఓట్లు కీలకం కానున్నాయి. ఇరు పార్టీలవారు తెలుగులో కూడా ఓట్లను అభ్యర్థిస్తూ ప్రచారం చేస్తున్నారు. దీంతో అక్కడి తెలుగువారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికన్లందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తానని డెమొక్రటిక్‌ అభ్యర్ధి జోబైడెన్‌ హామీ ఇచ్చారు. తన సొంతరాష్ట్రం డెలావర్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కరోనాను ట్రంప్‌ కట్టడి చేయలేకపోయారని, అందుకే 2 లక్షలకు పైగా మరణాలు సంభవించాయని విమర్శించారు. ట్రంప్‌ కారణంగా ఎకానమీపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందని ఆరోపించారు. తాను ఎన్నికయిన తర్వాత అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తానని వాగ్దానం చేశారు బైడెన్.


Show Full Article
Print Article
Next Story
More Stories