కాసేపట్లో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల సమావేశం

Telugu States Conference: విభజన చట్టం పెండింగ్ అంశాలపై కేంద్ర హోంశాఖ సమావేశం

Arun Chilukuri
Published on: 12 Jan 2022 12:19 PM IST
Telugu States Conference under the auspices of the Union Home Ministry Today
X

కాసేపట్లో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల సమావేశం

Telugu States Conference: తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై నేడు అత్యంత కీలక సమావేశం జరగనుంది. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి సమావేశం జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉదయం 11గంటలకు జరిగే ఈ భేటీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శితో పాటు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధానకార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు అలాగే కొన్ని అంశాలలో భిన్నఅభిప్రాయాలు ఉన్నాయి. దీంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం చోటు చేసుకుంది. అయితే కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో సమావేశం అయితే ఈ వివాదాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఇరు రాష్ట్రా ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అయితే ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు భిన్న అభిప్రాయాలు షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజనపై ఎక్కవ వస్తున్నాయి. అయితే దీని పైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story