తమిళనాడులో తెలుగు జర్నలిస్ట్ దారుణ హత్య

Arun Chilukuri
Published on: 23 Nov 2020 3:15 PM IST
తమిళనాడులో తెలుగు జర్నలిస్ట్ దారుణ హత్య
X

తమిళనాడులో తెలుగు జర్నలిస్ట్‌ దారుణ హత్యకు గురైయ్యాడు. తమిళ దినపత్రికలో రిపోర్టర్‌గా పని చేస్తున్న నాగరాజును దుండగులు వేట కొడవళ్లతో నరికి చంపారు. నాగరాజు రియల్ ఎస్టేట్ మాఫియాపై వరుస కథనాలు రాసారు. దాంతో రియల్ ఎస్టేట్ మాఫియానే నాగరాజు హత్యకు కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి హోసూర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగరాజు చిత్తూరు జిల్లా కుప్పం వాసిగా పోలీసులు గుర్తించారు. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు తెలుగు జర్నలిస్ట్‌‌లు దారుణ హత్యకు గురి కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story