ఫెమినా 2020 మిస్ ఇండియాగా తెలుగమ్మాయి

Arun Chilukuri
Published on: 11 Feb 2021 4:42 PM IST
ఫెమినా 2020 మిస్ ఇండియాగా తెలుగమ్మాయి
X

ఫెమినా 2020 మిస్ ఇండియాగా తెలుగమ్మాయి 

అచ్చ తెలుగమ్మాయి తెలంగాణ ముద్దుగుమ్మను మిస్ ఇండియా 2020 టైటిల్ వరించింది. అత్యంత వైభవంగా జరిగిన వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీలో హైదరాబాద్‌ అమ్మాయి మానస వారణాసి విజేతగా నిలిచింది. దీంతో 70వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరపున మానస పాల్గొననుంది. ఇక వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా 2020 రన్నరప్‌గా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాన్యా సింగ్, మిస్ గ్రాండ్ ఇండియా 2020గా హర్యానాకు చెందిన మానికా షియోఖండ్ నిలిచారు. మిస్ ఇండియా 2019 సుమన్ రావు మానసకు కిరీటాన్ని బహూకరించారు.

మరోవైపు ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో విజేతగా నిలిచిన మానస వారణాసి వయసు 23 సంవత్సరాలు. పుట్టింది హైదరాబాద్‏లోనే. గ్లోబల్ ఇండియన్ స్కూల్లో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన మానస వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీర్ పూర్తిచేసింది. ఇంజినీరింగ్ పూర్తిచేసిన మానస ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‏ఛేంజ్ అనలిస్ట్‏గా పనిచేస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story