Supreme Court: ఇవాళ సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ

Supreme Court: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల జీవోతో పాటు ఎన్నికల నోటిఫికేషన్‌ అమలును నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Arun Chilukuri
Published on: 16 Oct 2025 11:14 AM IST
Supreme Court: ఇవాళ సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ
X

 Supreme Court: ఇవాళ సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ

Supreme Court: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల జీవోతో పాటు ఎన్నికల నోటిఫికేషన్‌ అమలును నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రిజర్వేషన్ల అమలు జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ స్పెషల్‌ లీవ్ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం విచారించనుంది.

తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని వాదించనుంది. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా జనాభా గణాంకాలపై సర్వే నిర్వహించి, బీసీ జనాభా 57.6% ఉన్నందున 42% రిజర్వేషన్‌లు కల్పించామని, దీనికి అనుగుణంగా రిజర్వేషన్‌ల పరిమితిని సవరిస్తూ చట్టం తీసుకువచ్చిన విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లనుంది తెలంగాణ ప్రభుత్వం. దీంతో.. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story