గవర్నర్‌పై తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను విచారించనున్న సుప్రీంకోర్టు

* గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్

Dhatripriya
Published on: 10 April 2023 10:09 AM IST
Telangana Governments Petition Hearing Against The Governor In Supreme Court
X

గవర్నర్‌పై తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను విచారించనున్న సుప్రీంకోర్టు

Supreme Court: గవర్నర్‌పై తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. 10 బిల్లులు పెండింగ్‌లో పెట్టారని ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. చట్టసభలు ఆమోదించిన బిల్లులకు.. గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. బిల్లుల ఆమోదాన్ని ఆలస్యం చేయడం.. ప్రజాస్వామ స్ఫూర్తి, ప్రజల ఆకాంక్షకు విరుద్ధమని.. విషయ తీవ్రత, ప్రాధాన్యత దృష్ట్యా విధి లేకే సుప్రీంకోర్టును ఆశ్రయించామంటోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఇప్పటికే పెండింగ్ బిల్లుల ఆమోదంపై గవర్నర్ కార్యదర్శితో అడిషనల్ సోలిసిటరి జనరల్ చర్చించారు. రాజ్యాంగంలోని 200వ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ బిల్లును ఆమోదించడం లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని పిటిషన్‌లో పేర్కొంది ప్రభుత్వం.

Dhatripriya

Dhatripriya

Next Story