Congress: హస్తినకి క్యూ కట్టిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు

Congress: రాహుల్‌కు పొంగులేటి,జూపల్లిని పరిచయం చేయనున్న రేవంత్

Shekhar G
Published on: 26 Jun 2023 1:21 PM IST
Telangana Congress Leaders Queued Up For The Congress Office In Delhi
X

Congress: హస్తినకి క్యూ కట్టిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు

Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో పరిణామాలు రసవత్తరంగా మారుతున్నాయి. నేతలు ఒక్కొక్కరుగా హస్తినకి క్యూ కట్టారు. రాబోయే ఎన్నికలకు సన్నద్ధతపై ముఖ్య నేతలను ఢిల్లీకి రావాల్సిందిగా హైకమాండ్ ఆదేశించింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి డిల్లీలో ఉండగా.. పలువురు నేతలు ఇవాళ డిల్లీకి వెళ్లనున్నారు. రేపు ముఖ్య నేతలతో కాంగ్రెస్ హైకమాండ్ మీటింగ్‌ జరగనుండగా.. పార్టీలో చేరికలు, ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు పార్టీ పెద్దలు.

ఇక ఇవాళ మధ్యాహ్నం రాహుల్‌గాంధీతో టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి పొంగులేటి, జూపల్లితో పాటు వెళ్లనున్నారు రేవంత్. రాహుల్‌ గాంధీకి పరిచయం చేయనున్నారు. ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్‌లో పొంగులేటి, జూపల్లి చేరికపై క్లారిటీ రానుంది.

Shekhar G

Shekhar G

Next Story