టిక్ టాక్‌లో లైక్స్ రావడం లేదని యువకుడి ఆత్మహత్య

టిక్ టాక్‌లో లైక్స్ రావడం లేదని యువకుడి ఆత్మహత్య
x
Highlights

టిక్‌టాక్‌ మానియాలో యువత ఊగిపోతోంది. టిక్‌టాక్‌ వీడియోలతో సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయ్యేందుకు నానా పాట్లు పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా పెద్దలు...

టిక్‌టాక్‌ మానియాలో యువత ఊగిపోతోంది. టిక్‌టాక్‌ వీడియోలతో సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయ్యేందుకు నానా పాట్లు పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా పెద్దలు సైతం టిక్‌టాక్‌లు చేస్తూ ఊహా లోకాల్లో తేలిపోతున్నారు. దీనివల్ల వస్తోన్న పాపులార్టీ కంటే చాలా చోట్ల ఎక్కువ అనర్థాలే చోటుచేసుకుంటున్నాయి. అనేక సందర్భాల్లో ప్రాణాలు పోయేంతటి ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి. తాజాగా టిక్​టాక్​లో తాను పెడుతున్న వీడియోలకు సరిగ్గా లైక్స్ రావడం లేదని ఓ టీనేజర్​ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గురువారం నోయిడాలో జరిగింది. నోయిడాలోని సెక్టార్ 39 సలార్‌పూర్‌కు చెందిన 18 ఏళ్ల యువకుడు టిక్ టాక్‌లో యాక్టివ్‌గా ఉండేవాడు. నిత్యం వీడియోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేసేవాడు. దానికి వచ్చే లైకులు, షేర్స్ చూసి మురిసిపోయేవాడు.

ఐతే ఇటీవల తను చేసిన వీడియోలకు లైకులు రాకపోవడంతో మానసికంగా కుంగిపోయాడు. తన మిత్రులు, కుటుంబ సభ్యులతో చెప్పుకొని బాధపడేవాడు. ఈ క్రమంలోనే గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని మరణించాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గత కొద్ది రోజులుగా టిక్ టాక్‌లో లైకులు రావట్లేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని విచారణలో తేలినట్లు నోయిడా అదనపు డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories