logo
జాతీయం

TDP MPs meets president Ram Nath Kovind : రాష్ట్రపతిని కలిసిన టీడీపీ ఎంపీల బృందం

TDP MPs meets president Ram Nath Kovind : రాష్ట్రపతిని కలిసిన టీడీపీ ఎంపీల బృందం
X
Highlights

TDP MPs meets president Ram Nath Kovind : తెలుగుదేశం పార్టీ ఎంపీలు గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి రామనాథ్‌...

TDP MPs meets president Ram Nath Kovind : తెలుగుదేశం పార్టీ ఎంపీలు గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ను కలిశారు. గత 13 నెలలుగా రాష్ట్రంలో చోటుచేసుకొంటున్న ఘటనల గురించి వారు రాష్ట్రపతికి వివరించారు. కనకమేడల రవీంద్రకుమార్‌, గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిశారు. అనంతరం టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో జరిగిన ఇటీవల పరిణామాలను రాష్ట్రపతికి వివరించాము. రాష్ట్రంలో రాజ్యాంగ సంస్థల విధ్వంసం గురించి రాష్ట్రపతికి తెలిపాము. శాంతిభద్రతల పేరుతో ప్రతిపక్ష నేతల పై కేసులు, అరెస్ట్ చేసిన తరువాత వారి హక్కులను కాలరాస్తున్న విధానాన్ని వివరించామన్నారు.

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తూ , కోర్టులు ఇచ్చిన ఆదేశాలను పాటించడం లేదనే విషయాన్ని తెలిపాము. న్యాయవ్యవస్థ పై సోషల్ మీడియాలో దాడి గురించి, న్యాయమూర్తులపై చేస్తున్న కామెంట్ ల పై వివరించాము. రాష్ట్రంలో వివిధ పథకాలలో కుంభకోణాలు గురించి తెలిపాము. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల హక్కులను కాలరాస్తూ, వారిపై కేసులు, వేధింపుల గురించి తెలిపాము. రాష్ట్రపతి తనకున్న పరిధిలో వివిధ సంస్థల ద్వారా మేము చేసిన ఫిర్యాదులపై చర్యలను తీసుకుంటామని హామీ ఇచ్చారని కనకమేడల తెలిపారు.

Web TitleTDP MPs meets president Ram Nath Kovind in Delhi
Next Story