కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసిన టీడీపీ ఎంపీలు

ఏపీలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై ఫిర్యాదు రాజకీయ దాడులపైనా కంప్లైంట్ చేసిన టీడీపీ ఎంపీలు టీడీపీ టార్గెట్‌గా దాడులు చేస్తున్నారని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లిన ఎంపీలు

Arun Chilukuri
Updated on: 3 Feb 2021 7:21 PM IST
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసిన టీడీపీ ఎంపీలు
X

ఏపీలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. అలాగే, పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరుగుతోన్న రాజకీయ దాడులను కూడా అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అక్రమ అరెస్టులతోపాటు ప్రశ్నించినవారిపై జగన్ ప్రభుత్వం దాడులు చేయిస్తోందని ఫిర్యాదు చేశారు. ఇక, పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏపీలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వివరించారు టీడీపీ ఎంపీలు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story