Tamilnadu: స్టాలిన్ మంత్రి వర్గంలో ఐదుగురు తెలుగువారు

Muthuvel Karunanidhi Stalin File Photo
Tamilnadu:తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Tamilnadu: తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. స్టాలిన్ నేతృత్వంలోని ఆపార్టీ 133 స్థానాల్లో విజయం సాధించి అధికారన్ని హస్తగతం చేసుకుంది. అన్నాడిఎంకే 66 స్థానాల్లో విజయం సాధించి ప్రతిపక్ష పాత్రకే పరిమితం అయింది. ఘన విజయం సాధించిన డీఎంకే పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన స్టాలిన్... 34 మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు.స్టాలిన్ మంత్రి వర్గంలో ఐదుగురు తెలుగువారు ఉండటం గమనార్హం. కీలక శాఖలను అప్పగించడం గమనార్హం.
గతంలో బాలకృష్ణారెడ్డి, కదంబురు రాజు వంటి వారు పదేళ్ల పాటు మంత్రులుగా పని చేశారు. స్టాలిక్ మంత్రి వర్గంలో కీలక శాఖలు దక్కించుకున్న తెలుగు వారు.. కేకేఎస్ రామచంద్రన్ - అరుప్పుకొట్టై ఎమ్మెల్యే. కీలకమైన రెవెన్యూ శాఖను దక్కించుకున్నారు.ఏ వేలు - తిరువణ్ణామలై నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఈయన పీడబ్ల్యూడీ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఆర్ గాంధీ - రాణిపేట నియోజకవర్గంలో పోటీచేసి విజయంసాధించారు. గాంధీకి టెక్స్ టైల్ శాఖ మంత్రిగా నియమించారు. దేవాదాయశాఖ మంత్రిగా పీకే శేఖర్ బాబు (చెన్నై దురైముగం నియోజకవర్గం)..తిరుచ్చి వెస్ట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కేఎన్ నెహ్రూ మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.
గతంలో సీఎంలుగా పనిచేసిన కరుణానిధి, జయలలిత, పళనిస్వామి, పన్నీర్ సెల్వం అందరూ తమ కేబినెట్లో తెలుగువారికి ప్రాతినిధ్యాన్ని కల్పించారు. స్టాలిన్ కూడా అదే ఒరవడిని కొనసాగించారు. తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో తెలుగువారు పెద్ద సంఖ్యలో స్థిరపడ్డారు. అందుకే ఆయా ప్రాంతాల్లో అన్ని పార్టీలు తెలుగువారికి టికెట్లు ఇస్తుంటాయి. తాజా ఎన్నికల్లో 15 మంది తెలుగు వారు వివిధ పార్టీల ద్వారా గెలుపొందారు.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
అనంతపురం జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి...
28 May 2022 2:17 AM GMTనిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMT