Tamil Nadu ప్రముఖ యూట్యూబర్ పబ్జీ గేమర్ మదన్ దంపతుల అరెస్ట్

Tamil Nadu: తమిళనాడులో పబ్జీ ఆన్ లైన్ గేముతో కోట్ల రూపాయలు మోసగించిన యూ ట్యూబర్ మదన్ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Arun Chilukuri
Published on: 20 Jun 2021 12:48 PM IST
Tamil Nadu YouTuber Couple Arrested For Obscenity
X

Tamil Nadu ప్రముఖ యూట్యూబర్ పబ్జీ గేమర్ మదన్ దంపతుల అరెస్ట్

Tamil Nadu: తమిళనాడులో పబ్జీ ఆన్ లైన్ గేముతో కోట్ల రూపాయలు మోసగించిన యూ ట్యూబర్ మదన్ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబ్ ఛానల్స్, గేమింగ్ యాప్స్ నడుపుతూ లైవ్ స్ట్రీమింగ్ లో అసభ్యకరణ సంభాషణలు చేస్తున్నట్లు గుర్తించారు. మహిళలను కించపరిచే విధంగా అసభ్య పదజాలతో సంభాషణలు చేస్తూ వీక్షకులను ఆకట్టుకుంటున్నారు మదన్ దంపతులు. తాజాగా మదన్ పెట్టిన ఓ వీడియో వివాదాస్పదంగా మారింది. లక్షలాది రూపాయల ఆదాయం అర్జిస్తున్నట్లుగా మదన్ దంపతులపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. రంగంలోకి దిగిన ధర్మపురి పోలీసులు మదన్ దంపతులను అరెస్ట్ చేసి చెన్నై తీసుకు వచ్చారు.

మదన్ ఖాతాలోని నాలుగు కోట్లు రూపాయలు సీజ్ చేశారు. యూ ట్యూబ్ ద్వారా ప్రతినెల మూడు లక్షల వరకు మదన్ సంపాదిస్తున్నాడని అతడికి మూడ లక్షరీ కార్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మదన్ సబ్ సక్కైబర్లలో చాలా మంది మైనర్లు ఉన్నట్లు పోలీసు విచారణలో వెల్లడయ్యింది. పబ్జీ లేదా ఇతర గేమింగ్ రూల్స్ ను మదన్ ఉల్లంఘించాడో లేదో తెలుసుకునే పనిలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. బెయిల్ కోసం మదన్ పిటిషన్ వేయగా వాదనల సందర్భంగా అతడు మాట్లాడిన వీడియోలను చూసిన మద్రాస్ హైకోర్టు షాక్ అయ్యింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story