Karur: కరూర్‌కు కేంద్ర మంత్రులు.. తొక్కిసలాట ప్రాంతాన్ని పరిశీలించిన నిర్మలాసీతారామన్

Karur: తమిళనాడు విజయ్ పార్టీ ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని కేంద్రమంత్రులు, నిర్మలా సీతారామన్, ఎల్‌. మురుగన్ పరిశీలించారు.

Arun Chilukuri
Published on: 29 Sept 2025 4:23 PM IST
Karur: కరూర్‌కు కేంద్ర మంత్రులు.. తొక్కిసలాట ప్రాంతాన్ని పరిశీలించిన నిర్మలాసీతారామన్
X

Karur: తమిళనాడు విజయ్ పార్టీ ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని కేంద్రమంత్రులు, నిర్మలా సీతారామన్, ఎల్‌. మురుగన్ పరిశీలించారు. అనంతరం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోడీ సూచనతో బాధితులను పరామర్శించి ఓదార్చినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్రం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story