Tamil Nadu polls 2021: ఎన్నికల వేళ శశికళకు షాక్‌

Tamil Nadu polls 2021: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ శశికళకు భారీ షాక్‌ తగిలింది.

Arun Chilukuri
Published on: 5 April 2021 5:39 PM IST
Tamil Nadu polls 2021: VK Sasikalas Name Missing from Voter List
X

Tamil Nadu polls 2021: ఎన్నికల వేళ శశికళకు షాక్‌

Tamil Nadu polls 2021: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ శశికళకు భారీ షాక్‌ తగిలింది. ఓటరు లిస్టులో చిన్నమ్మ పేరు గల్లంతైంది. పోలింగ్‌కు ఒక్కరోజు ముందు ఈ విషయం బయటపడింది. మరోవైపు శశికళ పేరును అన్నాడీఎంకే కావాలనే తొలగించిందని ఆరోపించారు దినకరణ్‌‌.

శశికళ పేరు ఓటర్ల జాబితాలో కనిపించకపోవడంపై ఇప్పటికే అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(ఏఎంఎంకే) కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అయితే తమిళనాడు ఎన్నికలకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం శశికళకు దాదాపుగా లేనట్టేననే ప్రచారం జరుగుతోంది. వీకే శశికళ పేరును ఓటర్ల జాబితా నుంచి ఉద్దేశపూర్వకంగానే తొలగించారని, అందుకు ప్రధాన కారణం పళనిస్వామేనని ఏఎంఎంకే ఆరోపిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story