Temple For Alien: ఏకంగా ఏలియ‌న్‌కే గుడి క‌ట్టేశాడు.. ఎందుకో తెలుసా.?

Temple For Alien: సాధారణంగా దేవుళ్లకు గుడి కట్టడం చూశాం... అభిమానంతో నటులు, నాయకులకు గుళ్లు కట్టడం చూశాం..

Arun Chilukuri
Updated on: 3 Aug 2024 9:28 PM IST
Temple For Alien: ఏకంగా ఏలియ‌న్‌కే గుడి క‌ట్టేశాడు.. ఎందుకో తెలుసా.?
X

Temple For Alien: ఏకంగా ఏలియ‌న్‌కే గుడి క‌ట్టేశాడు.. ఎందుకో తెలుసా.?

Temple For Alien: సాధారణంగా దేవుళ్లకు గుడి కట్టడం చూశాం... అభిమానంతో నటులు, నాయకులకు గుళ్లు కట్టడం చూశాం.. కానీ ఓ వ్యక్తి మాత్రం వింతగా ఏలియన్లకు గుడి కట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. హీరోయిన్లకు గుడులు కట్టే ట్రెండ్‌లో ముందు వరుసలో ఉండే తమిళనాడులోనే ఏలియన్ గుడి కూడా నిర్మాణం అవుతూ చర్చనీయంగా మారింది.

తమిళనాడులోని సేలం జిల్లాలో ఓ వ్యక్తి గ్రహాంతరవాసికి గుడికట్టాడు. మల్లమూప్పన్‌ పట్టి సమీపంలోని రామగౌండనూరుకు చెందిన సిద్ధార్థ్ భాగ్య స్థానికంగా శివాలయాన్ని నిర్మించాడు. మూలమూర్తిగా ఆ ఆలయంలో శివలింగం ప్రతిష్టించిన అతను.. పక్కనే అగస్త్య మహర్షి, మరో మండపంలో ఏలియన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. అంతేకాదు రోజూ శివాలయంతో పాటు ఏలియన్ గుడిలోనూ పూజలు చేస్తున్నాడు. శివుడు ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత గ్రహాంతరవాసులు పుట్టారని అగస్త్య మహర్షి గ్రంథాల్లో రాశారని అందుకే తాను ఏలియన్ విగ్రహాలకు పూజ చేస్తున్నానని తెలిపారు.

మ‌రిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Arun Chilukuri

Arun Chilukuri

Next Story