Tamil Nadu Election: నామినేషన్ వేసిన డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం

Tamil Nadu Election:తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బొడినాయకనూర్ నియోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేశారు.

Kranthi
Published on: 12 March 2021 4:48 PM IST
Tamil Nadu Election: Panneerselvam Files Nomination in Bodinaickanur
X

ఇమేజ్ సోర్స్:(ది హన్స్ ఇండియా)

Tamil Nadu Assembly Election: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నామినేషన్ వేశారు. తన సొంత జిల్లా థేనిలోని బొడినాయకనూర్ నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. నామినేషన్ వేసిన సందర్భంగా ఆయన వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. తన నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి ఓపీఎస్ అందజేశారు. గత రెండుసార్లుగా తాను ఇదే నియోజవర్గం నుంచి గెలుస్తూ వచ్చానని, మూడోసారి కూడా ఇదే నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశానని చెప్పారు. నియజకవర్గానికి అవసరమైన అన్ని పనులు చేశానని, తన పనితీరుపై ప్రజలు కూడా సంతృప్తికరంగా ఉండటంతో మళ్లీ తనకే ఈ సీటు కేటాయించినట్టు తెలిపారు. ఈసారి కూడా ప్రజల మద్దతు తనకు లభిస్తుందన్న ఆశాభావంతో ఉన్నట్టు పేర్కొన్నారు. 234 అసెంబ్లీ సీట్లు ఉన్న తమిళనాడులో ఏప్రిల్ 6న ఒకే దశలో ఎన్నికలు జరుగనున్నాయి.

Kranthi

Kranthi

Next Story