ఎవరి ఖర్చు వారే భరించాలి: కమల్‌హాసన్‌

Arun Chilukuri
Published on: 6 March 2021 9:03 PM IST
ఎవరి ఖర్చు వారే భరించాలి: కమల్‌హాసన్‌
X

ఎవరి ఖర్చు వారే భరించాలి: కమల్‌హాసన్‌

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి ఆర్థిక సాయం చేయబోమని స్పష్టం చేశారు MNM అధ్యక్షుడు కమల్‌ హాసన్‌. ఎవరి ఖర్చు వారే భరించాలని అభ్యర్థులకు తేల్చిచెప్పారాయన. కమల్‌ మాటలతో అభ్యర్థులు ఖంగుతిన్నారు. శాసనసభ ఎన్నికల్లో MNM నేతృత్వంలో కూటమి ఏర్పాటుకు కమల్‌హాసన్‌ ముమ్మర ప్రయత్నాలు చేపట్టారు. అదే సమయంలో పార్టీ తరఫున పోటీచేసేందుకు దరఖాస్తులు సమర్పించిన వారిని ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు నగదు, బహుమతులు ఇవ్వరాదని కమల్‌ ఇప్పటికే పిలుపునిచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story