Tamil Nadu CM: నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీఎం స్టాలిన్ లేఖలు

* బాణాసంచా‌పై మూకుమ్మడి నిషేధంపై పునరాలోచించాలని విజ్ఞప్తి

Shilpa
Published on: 16 Oct 2021 7:16 AM IST
Tamil Nadu CM MK Stalin Wrote a letters to Delhi Odisha Rajasthan Haryana Chief Ministers
X

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (ఫోటో- ది హన్స్ ఇండియా)

Tamil Nadu CM: బాణాసంచా‌పై విధించిన మూకుమ్మడి నిషేధంపై పునరాలోచించాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. బాణాసంచా విక్రయాలపై మూకుమ్మడి నిషేధం సహేతుకం కాదన్న ఆయన టపాసుల తయారీపై దాదాపు 8 లక్షల మంది ఆధారపడి ఉన్నారని, వారి పొట్ట కొట్టొద్దని ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్, హర్యానా ముఖ్యమంత్రులను కోరారు. సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్ నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడి టపాసులను విక్రయించవచ్చన్నారు.

Shilpa

Shilpa

Next Story