కేజ్రీవాల్‌ను ఫాలో అవుతున్న స్టాలిన్...ఢిల్లీలో బిజి బిజీగా..

MK Stalin: ఢిల్లీ తరహాలో తమిళనాడులో మోడల్ స్కూళ్లను ప్రారంభిస్తామని...

Arun Chilukuri
Updated on: 1 April 2022 9:00 PM IST
Tamil Nadu CM MK Stalin Visits Delhi Govt Schools
X

కేజ్రీవాల్‌ను ఫాలో అవుతున్న స్టాలిన్...ఢిల్లీలో బిజి బిజీగా..

MK Stalin: ఢిల్లీ తరహాలో తమిళనాడులో మోడల్ స్కూళ్లను ప్రారంభిస్తామని, వాటిని సందర్శించాల్సిందిగా అరవింద్ కేజ్రీవాల్‌ను ఆహ్వానించామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. మూడు రోజుల ఢిల్లీ టూర్ లో భాగంగా స్టాలిన్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలతో కలిసి పశ్చిమ వినోద్ నగర్‌లోని రాజకీయ సర్వోదయ బాల విద్యాలయాన్ని స్టాలిన్ సందర్శించారు.

రాజకీయ సర్వోదయ కన్యా విద్యాలయంలో విద్యార్థులతో స్టాలిన్ మాట్లాడారు. ఢిల్లీలో అమలు చేసిన విద్యా సంస్కరణలు స్టాలిన్‌ను ఆకట్టుకున్నాయి. పాఠశాలతోపాటు ఆయన మొహల్లా క్లినిక్ కు కూడా సందర్శించి అక్కడ ఆమ్ ఆద్మీకి అందుతున్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. విద్యావ్యవస్థలో వచ్చిన మార్పుపై అధికారులు స్టాలిన్ కు వివరించారు. ఢిల్లీ ప్రభుత్వం గత ఆరేడేళ్లుగా విద్య కోసం తన బడ్జెట్‌లో దాదాపు 25 శాతం ఖర్చు చేస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story