Tamil Nadu Assembly Election 2021: కుటుంబానికో మినీ హెలికాప్టర్, కోటి నగదు, రాకెట్ జర్నీ

Tamil Nadu Assembly Election 2021: This Candidate Is Promising Free iPhone, Rs 1 cr, 3-storey house, Trip to Moon
x

Tamil Nadu Assembly Election 2021: కుటుంబానికో మినీ హెలికాప్టర్, కోటి నగదు, రాకెట్ జర్నీ

Highlights

Tamil Nadu Assembly Election 2021: ఎన్నికలంటే ఓటుకు ఐదొందలో వెయ్యో ఇస్తారు గానీ ఏకంగా కోట్లిస్తానంటున్నాడు మధురైలోని ఓ స్వతంత్ర అభ్యర్థి.

Tamil Nadu Assembly Election 2021: ఎన్నికలంటే ఓటుకు ఐదొందలో వెయ్యో ఇస్తారు గానీ ఏకంగా కోట్లిస్తానంటున్నాడు మధురైలోని ఓ స్వతంత్ర అభ్యర్థి. తమిళనాడు ఎన్నికల్లో శరవణన్‌ హామీలను చూస్తే ఎవరికైనా షాక్‌ కొట్టాల్సిందే. తనను గెలిపిస్తే ప్రజలను చంద్రుడి మీదకు షికారుకి తీసుకెళ్తా అంటున్నాడు. ఇతను మధురై దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు. ఇతని వెరైటీ వాగ్దానాల జాబితాలో మినీ-హెలికాప్టర్, ప్రతి ఇంటికి ఒక కోటి వార్షిక డిపాజిట్, వివాహాలకు బంగారు ఆభరణాలు, మూడు అంతస్థుల ఇల్లు, చంద్రుని పర్యటన ఉన్నాయి.

తన మ్యానిఫెస్టోలో ఆయన ఇచ్చిన వాగ్దానాలు నియోజకవర్గ ప్రజల దృష్టిని ఆకర్షించాయి. ఈ బాబు అంతటితో ఆగలేదు గృహిణుల పనిభారాన్ని తగ్గించే రోబోట్ ఇస్తాడట. నియోజకవర్గ ప్రజలను చల్లగా ఉంచడానికి 300 అడుగుల ఎత్తైన కృత్రిమ మంచు పర్వతం ఏర్పాటు చేస్తానంటున్నాడు. అంతరిక్ష పరిశోధన కేంద్రం, రాకెట్ లాంచ్ ప్యాడ్ కూడా ఇస్తానని హామీ ఇచ్చాడు. ఈ హామీల వీరుడి వార్త తమిళనాట వైరల్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories