Black Fungus: ముంచుకొస్తున్న బ్లాక్‌ ఫంగస్‌.. బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఎలా వుంటాయి..?

Symptoms of Black Fungus
x

Black Fungus: ముంచుకొస్తున్న బ్లాక్‌ ఫంగస్‌.. బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఎలా వుంటాయి..?

Highlights

Black Fungus: ఓ పక్క కరోనా మహమ్మారితో దేశమంతా ఉక్కిరిబిక్కిరవుతుంటే ఇది చాలదన్నట్టు ఇప్పడు బ్లాక్‌ ఫంగస్‌ ముప్పు ముంచుకొస్తోంది.

Black Fungus: ఓ పక్క కరోనా మహమ్మారితో దేశమంతా ఉక్కిరిబిక్కిరవుతుంటే ఇది చాలదన్నట్టు ఇప్పడు బ్లాక్‌ ఫంగస్‌ ముప్పు ముంచుకొస్తోంది. అరుదుగా వచ్చే ఈ ఫంగస్‌ కరోనా వైరస్‌ కారణంగా మరింత ప్రమాదకరంగా మారుతోంది. కోవిడ్‌ బారి నుంచి కోలుకున్నప్పటికీ బ్లాక్‌ ఫంగస్‌ రూపంలో మృత్యువు వెంటాడుతోంది. దేశంలో ముందుగా గుజరాత్‌‌లో కనిపించిన ఫంగస్ తర్వాత ఢిల్లీ, మహారాష్ట్రకూ పాకింది. ఇప్పుడు తెలంగాణలో కూడా బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదుకావడం భయాందోళనకు గురిచేస్తోంది.

కరోనా వైరస్ ముప్పుతో పాటు ఇప్పుడు దేశాన్ని బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది. అరుదుగా వచ్చే ఈ మ్యూకోర్‌ మైకోసిస్‌ ఫంగస్ ప్రమాదకరమైనదేనని ఇప్పటికే నిపుణులు వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న లేదా కోలుకుంటున్నవారిలో ఈ బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. కొవిడ్ వ్యాధి చికిత్సలో స్టెరాయిడ్లు అధికంగా వాడటం వల్ల ఈ వ్యాధి సోకే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. తలనొప్పి, జ్వరం, కళ్ల కింద నొప్పి, ముక్కు మూసుకుపోవడం, దగ్గు, ఊపిరి తీసుకోలేకపోవడం, పాక్షికంగా చూపు కోల్పోవడం వంటివి బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు.

కరోనా సెకండ్‌వేవ్‌ ధాటికి విలవిలలాడుతున్న మహారాష్ట్రలో బ్లాక్‌ ఫంగస్‌ వ్యాప్తి అధికంగా ఉన్నట్టు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ వ్యాధి బారిన పడి రాష్ట్రంలో ఇప్పటివరకు 52 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 8 మంది చూపు కోల్పోయారని తెలిపారు. వీరంతా కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నవారేనని అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలో 15వందల వరకూ బ్లాక్‌ ఫంగస్‌ కేసులు ఉన్నట్టు వైద్యాధికారులు ప్రకటన చేశారు.

మహారాష్ట్రతో పాటు గుజరాత్‌, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో తొలి కేసు, తొలి మరణం కూడా రికార్డు కావడం రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. భైంసాలో బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడి ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాడీలో ఇమ్యూనిటీ పవర్‌ బాగా తక్కువ ఉన్నవాళ్లకు, షుగర్ ఉన్న కరోనా పేషెంట్లకు, క్యాన్సర్‌ బాధితులకు ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువని డాక్టర్లు చెబుతున్నారు.

ఇక.. దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతుండడంతో దాని నివారణ, నియంత్రణపై కేంద్ర ఆరోగ్యశాఖ పలు సూచనలు చేసింది. బ్లాక్ ఫంగస్ లక్షణాలు, దాని బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సోకితే తీసుకునే చర్యల వంటి వాటిపై ట్విట్టర్‌లో పలు వివరాలను వెల్లడించింది. ఎక్కువగా అనారోగ్యంతో బాధపడే వారికే బ్లాక్ ఫంగస్ సోకుతోంది. ఇతర రోగకారక క్రిములతో పోరాడే శక్తిని తగ్గించేస్తోంది. ఇతర వాధ్యులు, మధుమేహం ఎక్కువగా ఉన్నవారు, స్టెరాయిడ్లు వాడకంతో ఇమ్యూనిటీ తగ్గిపోయినవారు, ఐసీయూలో ఎక్కువ కాలం ఉన్న వారికి బ్లాక్ ఫంగస్ ఎక్కువగా సోకుతోందని స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories