Karnataka: కర్ణాటక సీఎం ఎవరు..? కొనసాగుతున్న ఉత్కంఠ

Suspense over the Karnataka CM
x

Karnataka: కర్ణాటక సీఎం ఎవరు..? కొనసాగుతున్న ఉత్కంఠ

Highlights

Karnataka: ఇవాళ సాయంత్రంలోపు సీఎంను ప్రకటించే ఛాన్స్

Karnataka: కర్ణాటక సీఎం ఎవరనే అంశంపై కొనసాగుతన్న ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీ విజయానికి కృషిచేసిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ బలమైన నేతలే కావడంతో సీఎం ఎంపికలో పీఠముడి ఏర్పడింది. ఇద్దరిలో ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తే మరొకరు తిరుగుబాటు చేస్తారా అనే సంశయం పార్టీలో నెలకొన్నది. దీంతో పార్టీ అధిష్ఠానం సీఎం ఎంపికలో మల్లగుళ్లాలు పడుతున్నది.

తనను ముఖ్యమంత్రి నైనా చేయండి లేదా ఎమ్మెల్యేగా ఉండనీయండని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గేతో అన్నట్లు తెలుస్తోంది. సీఎం పదవిని ఆశిస్తున్న సిద్ధరామయ్య, డీకేతో ఖర్గే విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్యకు ఇప్పటికే ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారని... ఈ సారి తనను ముఖ్యమంత్రిని చేయాలని పార్టీ అధ్యక్షుడితో డీకే శివకుమార్ అన్నట్లు తెలుస్తోంది. ఆయనకు సీఎంగా మరోసారి అవకాశం కల్పిస్తే తనను ఎమ్మెల్యేగా ఉండనీయాలని కోరినట్లు తెలిసింది.

అదేవిధంగా సిద్దరామయ్యపై రాష్ట్రంలోని ప్రధానవర్గమైన లింగాయత్‌లు వ్యతిరేకంగా ఉన్నారని డీకే చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సోనియా,రాహుల్‌తో చర్చించి తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని పార్టీ వర్గాలు డీకే శివకుమార్‌తో చెప్పాయి. అయితే కొత్త సీఎం రేపే ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి విషయమై పార్టీ అధిష్ఠానం సాయంత్రంలోగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories