Amritpal: నేపాల్‌లో అమృత్ పాల్ దాక్కునట్లు అనుమానం

Amritpal: పారిపోవడానికి ప్రయత్నిస్తే అరెస్ట్ చేయాలని నేపాల్‌ను కోరిన భారత్

Dhatripriya
Updated on: 28 March 2023 10:01 AM IST
Suspected That Amrit Pal Is Hiding In Nepal
X

Amritpal: నేపాల్‌లో అమృత్ పాల్ దాక్కునట్లు అనుమానం

Amritpal: ఖలిస్తాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్​ అమృత్​పాల్​సింగ్ నేపాల్‌లో దాక్కున్నట్లు మన దేశం అనుమానిస్తోంది. అమృత్‌పాల్ నేపాల్ నుంచి వేరే దేశానికి పారిపోకుండా చూడాలని, ఇండియన్ పాస్‌పోర్టు లేదా ఏదైనా ఫేక్ పాస్‌పోర్టుతో పారిపోవడానికి ప్రయత్నిస్తే వెంటనే అరెస్టు చేయాలని నేపాల్ ప్రభుత్వాన్ని ఇండియా కోరింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్​ కాన్సులర్ సర్వీసెస్‌కు లేఖ రాసింది. అమృత్‌పాల్‌ను అరెస్టు చేయడంలో ప్రభుత్వ సంస్థలు సాయం చేయాలని ఖాట్మండులోని ఇండియన్ ఎంబసీ కోరింది.

అమృత్‌కు సంబంధించిన వివరాలను అన్ని హోటళ్లు, ఎయిర్ లైన్స్‌కు భారతీయ ఎంబసీ సర్క్యులేట్ చేసింది. అతడి వద్ద నకిలీ పాస్ పోర్టులు ఉన్నాయని ఎంబసీ అనుమానిస్తోంది. కాగా, ఈనెల 18 నుంచి అమృత్ పాల్ పరారీలో ఉన్నాడు.

Dhatripriya

Dhatripriya

Next Story