Supreme Court: అబార్షన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పెళ్లితో సంబంధం లేదు..

Supreme Courts Massive Order On Abortion
x

Supreme Court: అబార్షన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Highlights

Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది.

Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మహిళలందరికీ అబార్షన్‌ను ఎంచుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. ఒక మహిళ యొక్క వైవాహిక స్థితి అవాంఛిత గర్భాన్ని తొలగించే హక్కును హరించడం సాధ్యం కాదని సుప్రీం అభిప్రాయపడింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ మరియు నిబంధలన ప్రకారం.. ఒంటరి, అవివాహిత స్త్రీలకు అబార్షన్ చేయించుకునే హక్కు ఉందని తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు.

వైవాహిక అత్యాచారానికి గురైన మహిళ కూడా అబార్షన్ హక్కును కలిగి ఉంటుందని తెలిపింది అత్యున్నత న్యాయస్థానం. ఈ సందర్భంగా 'వైవాహిక అత్యాచారాన్ని' కూడా కోర్టు ప్రస్తావించింది. బలవంతపు గర్భధారణ నుంచి మహిళలను కాపాడాల్సిన అవసరం ఉందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories