Supreme Court: నేడు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ

Supreme Court The Hearing Of The  Vote For Note Case In Today
x

Supreme Court: నేడు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ

Highlights

Supreme Court: 16వ నెంబర్ కోర్టులో 109వ ఐటమ్‌గా విచారణకు రానున్న పిటిషన్

Supreme Court: తెలుగు రాష్ట్రాల్లో ప్రకపంపనలు సృష్టించిన ఓటుకు నోటు కేసు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసు పిటిషన్‌ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. కోర్టు నెంబర్ 16లో 109వ ఐటమ్‌గా విచారించనున్నారు న్యాయమూర్తులు. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ధర్మాసనం బెంచ్ ముందు ఓటుకు నోటు కేసు వాదనలు కొనసాగనున్నాయి. ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని ఏపీలోని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2017లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో తెలంగాణ ఏసీబీ నుంచి ఓటుకు నోటు కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ మరోపిటిషన్ దాఖలైంది. గతంలో రేవంత్‌రెడ్డి చుట్టే ఈ ఓటు నోటు వ్యవహారం కొనసాగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories