సుప్రీంకోర్టు వేసవి సెలవులు రద్దు

సుప్రీంకోర్టు వేసవి సెలవులు రద్దు
x
Highlights

కరోనా విపత్తు నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా విపత్తు నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా విపత్తు నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.సుప్రీంకోర్టుకి ఏటా మే 18 నుంచి జూన్‌ 19 మధ్య వేసవి సెలవులు ఉంటాయి.. అయితే ఈసారి కరోనా వైరస్ నేపథ్యంలో ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎస్‌.ఎ. బోబ్డే సెల‌వుల‌ను ర‌ద్దు చేశారు.. ఈ మేరకు సహచర జడ్జిలతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్‌ నియంత్రణకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే.

మరోవైపు వేసవి సెల‌వుల ర‌ద్దు చేయడంతో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా పలు కేసులను విచార‌ణ చేప‌ట్టాల‌ని జ‌స్టిస్ ఎస్‌.ఎ. బోబ్డే నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. కాగా లాక్‌డౌన్ వ‌ల్ల ఇప్ప‌టికే ప‌ని దినాల‌ను కోల్పోయామని, కాబ‌ట్టి వేస‌వి సెల‌వు‌లను తగ్గించాలని, వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా కేసుల‌ను విచారించాల‌ని జ‌స్టిస్ ఎల్ఎన్ రావుతో కూడిన‌ న్యాయ‌మూర్తుల క‌మిటీ సిఫార‌సు చేసింది. ఈ మేరకే చీఫ్ జస్టిస్ సెలవుల రద్దు నిర్ణయం తీసుకున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories