Supreme Court: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు

Supreme Court: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది.

Arun Chilukuri
Published on: 8 Dec 2025 12:56 PM IST
Supreme Court: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు
X

Supreme Court: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు

Supreme Court: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. 2023లో వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ కె. శంకర అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

పిటిషనర్ కె. శంకర తన పిటిషన్‌లో సిద్ధరామయ్య ఎన్నిక చెల్లదని పేర్కొన్నారు. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా సిద్ధరామయ్య అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో, వరుణ నియోజకవర్గం నుంచి సిద్ధరామయ్య ఎన్నికను రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించి, ఈ అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు నోటీసులు జారీ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story