Arvind Kejriwal: కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు బెయిల్‌ ఇవ్వడంలో ఎలాంటి మినహాయింపు లేదు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 16 May 2024 9:15 PM IST
Supreme Court Hearing On Petition Filed By Kejriwal
X

Arvind Kejriwal: కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ 

Arvind Kejriwal: లిక్కర్‌ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్‌ ఇవ్వడంలో ఎలాంటి మినహాయింపు లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే, ఈ తీర్పుపై విశ్లేషణను స్వాగతిస్తామని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఓటు వేస్తే.. జూన్‌ 2న తిరిగి జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండని అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రచారంలో చెబుతున్నారంటూ ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈడీ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన ధర్మాసనం.. ‘అది ఆయన అభిప్రాయమని... తామేమి ఏమీ చెప్పలేమని పేర్కొంది. తన అరెస్టుపై కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది.

ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణ సందర్భంగా మధ్యంతర బెయిల్‌కు సంబంధించిన ప్రకటనలపై ఈడీ, కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాదనలు.. స్పందనలను పరిగణనలోకి తీసుకోవడానికి న్యాయమూర్తులు జస్టిస్‌, సంజీవ్ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. అయితే, కేజ్రీవాల్‌ ఎప్పుడు కోర్టులో లొంగిపోవాలో తమ ఆదేశాల్లో స్పష్టంగా ఉందని.. ఇది సుప్రీంకోర్టు ఆదేశమని.. చట్టపాలన దాని ఆధారంగానే ఉంటుందని.. తాము ఎవరికీ మినహాయింపు ఇవ్వలేదని చెప్పింది. అదంతా ఆయన ఊహేనని.. ఇందులో మాట్లాడానికి ఏమీ లేదని స్పష్టం చేసింది. అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేయడంపై హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను అభిషేక్‌ మను సింఘ్వీ ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story