Supreme Court: లఖింపూర్‌ఖేరీ ఘటనపై విచారణ వాయిదా

*సీల్డ్ కవర్‌లో దర్యాప్తు నివేదిక అందజేత *నవంబర్ 8కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

Shilpa
Published on: 26 Oct 2021 2:05 PM IST
Supreme Court Hearing on Lakhimpur Kheri Incident Postponed to 08 11 2021
X

 లఖింపూర్‌ఖేరీ ఘటనపై విచారణ వాయిదా(ఫైల్ ఫోటో)

Supreme Court: లఖింపూర్‌ఖేరీ ఘటనపై విచారణను నవంబర్ 8కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. సీల్డ్ కవర్‌లో దర్యాప్తు నివేదిక అందజేసింది యూపీ ప్రభుత్వం. 68 మందిలో 30 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసినట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది యూపీ ప్రభుత్వం. 23 మంది ప్రత్యక్ష సాక్షులున్నారని వెల్లడించింది.

వందల సంఖ్యలో రైతుల ర్యాలీ నడుస్తుండగా ప్రత్యక్ష సాక్షులు కేవలం 23 మంది మాత్రమేనా అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. 2వ ఎఫ్ఐఆర్‌పై కూడా నివేదిక కోరింది. స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఏ కేసులోనైనా ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం కీలకమని సాక్షులకు భద్రత కల్పించాలని సూచించింది.

Shilpa

Shilpa

Next Story