ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్‌ కేసులపై సుప్రీం కోర్టులో విచారణ

ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్‌ కేసులపై సుప్రీం కోర్టులో విచారణ
x
Highlights

ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్‌ కేసులపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. నోడల్‌...

ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్‌ కేసులపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. నోడల్‌ అధికారుల నియామకంపై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌లో ఉన్న కేసులపై కోర్టు ఆరా తీసింది. కౌంటర్‌ దాఖలు చేసేందుకు ఆయా రాష్ట్రాలకు కోర్టు 2 వారాల సమయం ఇచ్చింది.

ఇక ఏపీలోని విశాఖపట్నం, కడపలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని హైకోర్టు తెలిపిందని అమికస్‌ క్యూరీ తెలిపారు. అవసరమైన కేసుల్లో సాక్షులకు రక్షణ కలిపించాలని అమికస్‌ క్యూరీ కోరారు. అయితే ప్రతి సాక్షికి రక్షణ కల్పించడం సాధ్యమా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీంతో సాక్షుల రక్షణ అంశాన్ని ట్రయల్‌ కోర్టు నిర్ణయించాలని అమికస్‌ క్యూరీ కోరారు. తదుపరి విచారణపై కోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories