Supreme Court On Women's Right : ఆస్తిలో కూతుళ్ళకు సమాన హక్కు!

Supreme Court On Womens Right : ఆస్తిలో కూతుళ్ళకు సమాన హక్కు!
x
supreme Court (File Photo)
Highlights

Supreme Court On Women's Right : మహిళల ఆస్తి హక్కుకు సంబంధించిన విషయంలో మంగళవారం సుప్రీంకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది..

Supreme Court On Women's Right : మహిళల ఆస్తి హక్కుకు సంబంధించిన విషయంలో మంగళవారం సుప్రీంకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది.. తల్లిదండ్రుల ఆస్తిలో కుమార్తెకు కూడా సమాన హక్కులు ఉంటాయని సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది.. సవరించిన హిందూ వారసత్వ చట్టం 2005 ప్రకారం తల్లిదండ్రుల ఆస్తిలో కుమార్తెకు కూడా సమాన హక్కులు ఉంటాయని పేర్కొంది.. కొడుకులకు ఉండే సర్వహక్కులు కూతుళ్ళకు కూడా వర్తిస్తాయని తెలిపింది.

ఒకేవేళ తండ్రి చనిపోయిన కూడా కూతుళ్ళకు ఆ హక్కులు వర్తిస్తాయని పేర్కొంది.. కూతుళ్ళ ఆస్తి హక్కులకి సంబంధించిన అనుమానాలను నేటి తీర్పు తెరదించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కీలక తీర్పునిచ్చింది. ఇక ఇదే అంశంపై ట్రయల్ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న విషయాలను ఆరు నెలల్లోనే నిర్ణయించాలని ధర్మాసనం ఆదేశించింది.

1956 నాటి హిందూ వారసత్వ చట్టానికి 2005లో సవరణ‌లు చేశారు. 2005 సెప్టెంబర్ 9న ఆ చ‌ట్టానికి భార‌త‌ పార్లమెంట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.. చట్టం రాకముందు లేదా తరువాత జన్మించారా అనే దానితో సంబంధం లేకుండా ఈ చట్టం అందరూ కూతుళ్ళకి వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories