Supreme Court: బాబా రామ్‌దేవ్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు

Supreme Court Asks Baba Ramdev To Produce Video & Transcripts Of His Statements On Allopathy
x

Supreme Court: బాబా రామ్‌దేవ్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు

Highlights

Supreme Court: అల్లోపతి మందుల గురించి చేసిన వ్యాఖ్యల అసలు రికార్డులను సమర్పించాలని బాబా రామ్‌దేవ్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.

Supreme Court: అల్లోపతి మందుల గురించి చేసిన వ్యాఖ్యల అసలు రికార్డులను సమర్పించాలని బాబా రామ్‌దేవ్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. రామ్‌దేవ్ తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఆయన చెప్పిన అసలు మాటలు ఏమిటి? మీరు మొత్తం వివరాలను సమర్పించలేదని ముకుల్ రోహత్గిని ఉద్దేశించి జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు.

దీనిపై రోహత్గి మాట్లాడుతూ, ఒరిజినల్ వీడియోను, దానిలోని మాటలను, రాసిన పత్రాలను సమర్పిస్తానని తెలిపారు. దీంతో తదుపరి విచారణను జూలై 5కు వాయిదా వేశారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో అల్లోపతి మందులను వాడటంపై రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై బిహార్, ఛత్తీస్‌గఢ్‌లలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖలు కేసులను దాఖలు చేశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories