Gali Janardhan Reddy: సుప్రీంకోర్టులో గాలి జనార్దనరెడ్డికి ఊరట

Gali Janardhan Reddy: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

Arun Chilukuri
Updated on: 19 Aug 2021 9:00 PM IST
Supreme Court Allows Gali Janardhan Reddy To Visit Bellary
X

Gali Janardhan Reddy: సుప్రీంకోర్టులో గాలి జనార్దనరెడ్డికి ఊరట

Gali Janardhan Reddy: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బళ్లారి, అనంతపురం, కడప వెళ్లేందుకు అత్యున్నత న్యాయస్థానం ఆయనకు అనుమతి ఇచ్చింది. జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేష్ మహేశ్వరిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గాలి జనార్ధన్ రెడ్డికి బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ షరతులు ఎక్కడా ఉల్లంఘించలేదన్న కోర్టు. స్థానిక జిల్లా ఎస్పీకి ముందస్తు సమాచారం అందించి ఆయా ప్రాంతాలకు వెళ్లొచ్చని పేర్కొంది. తదుపరి విచారణను నవంబర్ మూడో వారానికి వాయిదా వేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story