అమృత్‌సర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. తుపాకులు, కత్తులతో పోలీస్‌స్టేషన్‌ ముట్టడి..

Amritsar: వారీస్ పంజాబ్‌ దే అధినేత అమృత్‌పాల్‌ మద్దతుదారుల ఆందోళనలతో అమృత్‌సర్ అట్టుడికింది.

Arun Chilukuri
Updated on: 23 Feb 2023 7:15 PM IST
Supporters of Waris Punjab De Chief Break Through Police Barricades in Amritsar
X

అమృత్‌సర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. తుపాకులు, కత్తులతో పోలీస్‌స్టేషన్‌ ముట్టడి..

Amritsar: వారీస్ పంజాబ్‌ దే అధినేత అమృత్‌పాల్‌ మద్దతుదారుల ఆందోళనలతో అమృత్‌సర్ అట్టుడికింది. తుపాకులు, తల్వార్లతో పోలీస్‌ స్టేషన్‌పై దండెత్తడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన అమృత్‌పాల్‌ అనుచరులు బారికేడ్లు ధ్వంసం చేసి లోపలికి చొచ్చుకెళ్లడమే కాకుండా నిలువరించిన పోలీసులపై కూడా దాడి చేశారు.

అమృత్‌పాల్‌ సింగ్‌ సన్నిహితుడైన లవ్‌ప్రీత్‌ తుఫాన్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో అమృత్‌సర్‌లో హింస చెలరేగింది. అక్రమంగా తుఫాన్‌ను అరెస్ట్ చేశారంటూ వారిస్ పంజాబ్‌ దే అధినేత అమృత్‌పాల్‌ తన అనుచరులతో సహా అజ్నాలా పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. తుఫాన్‌ను అరెస్ట్ చేసి పోలీసులు చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు అమృత్‌పాల్‌ సింగ్‌ అనుచరులు. మరోవైపు లవ్‌ప్రీత్‌ తుఫాన్‌ను విడుదల చేయకపోతే తమ ప్లాన్ అమలు చేస్తామని పోలీసులను హెచ్చరించారు అమృత్‌ పాల్‌.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story