దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న సుఖేష్ చాటింగ్

* సీఎం కేజ్రీవాల్, కవిత మధ్య లావాదేవీలు జరిగాయన్న సుఖేష్

Dhatripriya
Published on: 13 April 2023 7:36 AM IST
Sukesh Chatting Is Creating Stir In The Countrys Politics
X

దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న సుఖేష్ చాటింగ్

Sukesh: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం కేసులో.. సుఖేష్ వరుస లేఖలు ప్రకంపనలు రేపుతున్నాయి. చెప్పినట్లుగానే తన దగ్గర ఉన్న చాట్లను కూడా బయటపెట్టాడు సుఖేష్. తన సెల్ ఫోన్ లో కవిత టీఆర్ ఎస్ పేరున ఉన్న నెంబర్ తో చాట్ చేసిన స్క్రీన్ షాట్స్ ను రిలీజ్ చేశాడు. అయితే మొత్తం 6 పేజీల లేఖను సుఖేష్ విడుదల చేయగా తాజా లేఖ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాను బయటపెట్టిన ఆధారాలు లిక్కర్ స్కాం కేసు విచారణకు ఉపయోగపడతాయని లేఖలో పేర్కొన్నాడు సుఖేష్. ఈ లేఖను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్ర హోంశాఖ, సీజేఐ,సీబీఐ, ఈడీలకు లేఖ రాస్తూ ఆధారాలను జతచేశారు సుఖేష్.

Dhatripriya

Dhatripriya

Next Story