ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై సుఖేష్‌ చంద్రశేఖర్‌ సంచలన ఆరోపణలు

Sukesh Chandrasekhar: కేజ్రీవాల్‌ ఇంటి ఫర్నీచర్‌కు అవసరమైన ఖర్చులు నేనే భరించా

Jyothi
Published on: 24 May 2023 12:24 PM IST
Sukesh Chandrasekhar Sensational Allegations against Delhi CM Kejriwal
X

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై సుఖేష్‌ చంద్రశేఖర్‌ సంచలన ఆరోపణలు

Sukesh Chandrasekhar: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటి నిర్మాణం పై సుఖేష్‌ చంద్రశేఖర్‌ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్‌ ఇంటి ఫర్నిచర్ కి అయిన ఖర్చులను తానే భరించానని, అందుకు సంబంధించిన బిల్లులున్నాయనీ సుఖేష్ చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత షెల్ కంపెనీల అకౌంట్స్ నుంచి మారిషస్ లోని కైలాష్ గెహ్లాట్ బంధువుల అకౌంట్లకు నగదు బదిలీ అయిందని తెలిపారు. 25+25+30 కోట్ల నగదు బదిలీలు జరిగాయన్నారు.

ఇందుకు సంబంధించి కేజ్రీవాల్ ఫేస్ టైం చాట్స్ వివరాలను కూడా త్వరలోనే విడుదల చేస్తామన్నారు. వాస్తవాలు బయటపెడుతున్నందుకే తనను మానసికంగా వేధిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. తనకు అనుకూలమైన జైలు అధికారులు ద్వారా వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషమై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశానని.. త్వరలోనే మరో కుంభకోణాన్ని బయట పెడతామని సుఖేశ్ చంద్రశేఖర్ తెలిపారు.

Jyothi

Jyothi

Next Story