కొనసాగుతున్న సుఖేష్ లేఖల ప్రకంపనలు.. 'తీహార్ జైలుకు స్వాగతం'.. కవిత, కేజ్రీవాల్..

Delhi Liquor Policy Case: మనీలాండరింగ్ కేసులో తీహార్‌ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖల ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి.

Arun Chilukuri
Published on: 15 April 2023 3:59 PM IST
Sukesh Chandrasekhar Released Some More Chatting Screenshots
X

కొనసాగుతున్న సుఖేష్ లేఖల ప్రకంపనలు.. ‘తీహార్ జైలుకు స్వాగతం’.. కవిత, కేజ్రీవాల్..

Delhi Liquor Policy Case: మనీలాండరింగ్ కేసులో తీహార్‌ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖల ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 5 పేజీలతో మరో లేఖ విడుదల చేశాడు సుఖేష్.. ఈ సారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫోన్ నెంబర్లు ఉన్న స్క్రీన్ షాట్‌ విడుదల చేశాడు. తీహార్ క్లబ్ కు వస్తున్నారంటూ కవిత, కేజ్రీవాల్‌కు సుఖేష్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. అతి త్వరలోనే కేజ్రీవాల్‌తో జరిపిన చాట్స్‌ను విడుదల చేస్తానంటూ మరో బాంబు పేల్చారు. ట్విట్టర్ల ద్వారా సమాధానాల ఇవ్వొద్దన్న సుఖేష్.. ఇవన్నీ పాత ట్రిక్కులని పనిచేయవన్నారు.

తనను దొంగ, ఆర్ధిక నేరగాడిని అంటూ విమర్శించారని, మీరు కూడా అందులో భాగస్వాములేనంటూ సుఖేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధైర్యం వుంటే సరైన రీతలో, సక్రమంగా విచారణ జరిగేలా సహకరించాలని కవితకు సుఖేష్ చంద్రశేఖర్ సవాల్ విసిరారు. కవితను కవితక్క అని సంబోధించానని, ఆమెను తన పెద్దక్కగా భావించానని సుఖేష్ తెలిపాడు. దేశ ప్రజా ప్రయోజనాల రీత్య సత్యం మాట్లాడాలని తాజాగా విడుదల చేసిన లేఖలో తెలిపాడు సుఖేష్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story