ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు సుఖేష్‌ చంద్రశేఖర్‌ లేఖ.. జైలులో తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని వినతి

Sukesh Chandrasekhar: ఫోన్‌కాల్‌ రికార్డు ఆడియోను లేఖతో పాటు పంపిన సుఖేష్‌

Shekhar G
Published on: 9 July 2023 6:13 PM IST
Sukesh Chandrasekhar Letter To Delhi Governor
X

ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు సుఖేష్‌ చంద్రశేఖర్‌ లేఖ.. జైలులో తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని వినతి

Sukesh Chandrasekhar: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌లకు చెందిన అనుచరుడు తనను జైలులో హత్య చేస్తానని బెదిరించినట్లు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ రాశారు. ఆప్ నేతలపై చేస్తున్న ఆరోపణలను ఆపకపోతే జైలులో తినే ఆహారంలో విషం కలిపి చంపుతానని తన న్యాయవాది అనంత్ మాలిక్‌కు బెదిరింపు కాల్ వచ్చినట్లు లేఖలో పేర్కొన్నారు.

ఈ విషయాన్ని జైలులో తనకు తెలియజేయాలని తన న్యాయవాదిని బెదిరించాడని, ఆ ఫోన్ కాల్ రికార్డ్ ఆడియోను లేఖతో పాటు పంపుతున్నట్లు చెప్పుకొచ్చారు. తనకు ప్రాణహాని ఉందని తగు చర్యలు తీసుకోవాలని సుఖేష్ చంద్రశేఖర్ కోరారు. జైళ్ల శాఖ మంత్రిగా ఉన్న కైలాష్ ఘెలోట్‌ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేతిలో కీలుబొమ్మలు కాబట్టి.., జైలు అధికారుల నుండే అతిపెద్ద ముప్పు ఉందని లేఖలో తెలిపారు. సత్యేంద్ర జైన్ భార్య పూనమ్ జైన్ నుండి తన తల్లికి అనేక సార్లు కాల్స్ వచ్చాయని... కాల్ రికార్డులతో పాటు వివరాలను గతంలో ఈడీతో పాటు సీబీఐకి సమర్పించినట్లు లేఖలో వెల్లడించారు.

Shekhar G

Shekhar G

Next Story