హీరో అనుకున్నా అబ్బే.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి పై భార్య సుధామూర్తి షాకింగ్ కామెంట్స్..!

Sudha Murthy: సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి కర్ణాటకలో పోలింగ్ సందర్భంగా ఓటు వేశారు.

Arun Chilukuri
Updated on: 10 May 2023 7:30 PM IST
Sudha Murthy Recalls 1st Meeting With Husband Narayan Murthy in Kapil Sharma Show
X

హీరో అనుకున్నా అబ్బే.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి పై భార్య సుధామూర్తి షాకింగ్ కామెంట్స్..!

Sudha Murthy: సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనే ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి కర్ణాటకలో పోలింగ్ సందర్భంగా ఓటు వేశారు. తన భర్త నారాయణమూర్తితో కలిసి ఓటేశారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. యువత ఓటు హక్కు వినియోగించుకోవాలని..ఓటు వేసిన వాళ్లకే మాట్లాడే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. యువతకు దిశానిర్దేశం చేస్తూ సుధామూర్తి చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారితే..మరో వీడియో కూడా అందర్ని ఆకట్టుకుంటోంది.

బాలీవుడ్ ప్రముఖ షో ది కపిల్ శర్మ షో లో సుధామూర్తి పాల్గొన్నారు. ఈ టాక్ షోలో భాగంగా తన భర్తను మొదటిసారి ఎలా కలిసింది, ఆయన గురించి ఏం అనుకున్నారో ఈ విషయాలను ఆమె షోలో ప్రేక్షకులతో పంచుకున్నారు. తనకు ప్రసన్న అనే స్నేహితురాలు ఉండేదని, తను ప్రతి రోజు ఒక పుస్తకం తీసుకొచ్చేదని..అందులో మొదటిపేజీ పై నారాయణమూర్తి పేరుతో పాటు వివిధ దేశాల పేర్లు ఉండేవని..అలా ఉండడంతో నారాయణమూర్తి అంతర్జాతీయ బస్ కండక్టర్ ఏమో అనుకున్నానంటూ..ఇన్ఫోసిస్ కోఫౌండర్ గురించి తన మొదటి అభిప్రాయాన్ని సుధామూర్తి చెప్పి షాక్ ఇచ్చారు.

నారాయణమూర్తిని చూడకముందు ఆయన సినిమా హీరోలా ఉంటారని భావించానని కానీ మొదటిసారి చూడగానే ఎవరీ చిన్నపిల్లాడు అని అనిపించిందని సుధామూర్తి తెలిపారు. సుధామూర్తి మాటలు విని షోలో ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. సుధామూర్తి షోకు సంబంధించిన ప్రోమో వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ప్రోమో చూసిన నెటిజన్స్..సుధామూర్తి మాటలతో టాక్ షో చూడాలని స్ట్రాంగ్గా ఫిక్సయ్యారు. మరి, టాక్ షోలో సుధామూర్తి తన దాంపత్య జీవితంలోని ఇంకెన్ని రహస్యాలు చెప్పారో చూడాలి మరి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story