ప్రధాని మోడీకి క్లాసికల్ డాన్సర్ రిక్వెస్ట్.. ప్రతిసారి నా కృత్రిమ కాలును తొలగించమంటున్నారు

Sudha Chandran: ప్రముఖ నటి, క్లాసికల్ డాన్సర్ సుధా చంద్రన్ గురించి తెలియనివారుండరు.

Arun Chilukuri
Published on: 22 Oct 2021 6:36 PM IST
Sudha Chandran Says Airport Officials ask her to Remove Prosthetic Limb
X

ప్రధాని మోడీకి క్లాసికల్ డాన్సర్ రిక్వెస్ట్.. ప్రతిసారి నా కృత్రిమ కాలును తొలగించమంటున్నారు

Sudha Chandran: ప్రముఖ నటి, క్లాసికల్ డాన్సర్ సుధా చంద్రన్ గురించి తెలియనివారుండరు. మయూరి సినిమా నుంచి ప్రస్థానం ప్రారంభించి జాతీయ అవార్డులు సైతం అందుకున్నారు. అలాంటి సుధా చంద్రన్ ఎయిర్‌పోర్టులో తనకు ఎదురవుతున్న సమస్యపై ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నా ఎప్పుడూ ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకోలేదని, చెకింగ్ సమయంలో ఎయిర్‌పోర్టు సిబ్బంది మాత్రం తనను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని వాపోయారు.

ఎయిర్‌పోర్టు చెకింగ్‌లో ప్రతిసారి ఆర్టిఫిషియల్ కాలు తీసేయమని అధికారులు ఆదేశించడంపై అభ్యంతరం చెబుతూ సుధా చంద్రన్ ఓ వీడియోను విడుదల చేశారు. ప్రధాని మోడీతో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేస్తూ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వ్యక్తిగత పనులు, షూటింగ్స్ కోసం ప్రయాణిస్తున్న ప్రతిసారి ఇదే పరిస్థితి ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ కాలుతోనే నాట్యం చేస్తూ దేశానికే గర్వకారణంగా నిలిచిన తనపై ఇలా వ్యవహరించడం సరైనదేనా అంటూ ప్రశ్నించారు.

మరోవైపు సుధా చంద్రన్‌కు సీఐఎస్‌ఎఫ్ క్షమాపణలు చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్‌లో సుధా చంద్రన్ వీడియోపై స్పందించిన సీఐఎస్ఎఫ్‌ మరోసారి ఇలాంటి పొరపాట్లు జరక్కుండా సిబ్బందికి అవగాహన కల్పిస్తామని సుధా చంద్రన్‌కు హామీ సీఐఎస్‌ఎఫ్ ఇచ్చింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story