89 ఏళ్ళ మెట్రోమ్యాన్‌కు అవకాశంపై స్వామి ఫైర్‌

Arun Chilukuri
Updated on: 6 March 2021 9:30 PM IST
89 ఏళ్ళ మెట్రోమ్యాన్‌కు అవకాశంపై స్వామి ఫైర్‌
X

89 ఏళ్ళ మెట్రోమ్యాన్‌కు అవకాశంపై స్వామి ఫైర్‌

బీజేపీలో ఉంటూనే సందర్భం వచ్చినప్పుడల్లా పార్టీ నిర్ణయాలను విమర్శించే సీనియర్ నేత సుబ్రహ్మణ స్వామి మరోసారి విమర్శలు గుప్పించారు. కేరళ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రో మ్యాన్ శ్రీధరన్ పేరును ప్రకటించడాన్ని ఓ ట్వీట్‌లో ప్రశ్నించారు. అభ్యర్థుల వయోపరిమితిపై పార్టీ తన వైఖరిని మార్చుకున్నట్టు కనిపిస్తోందని కామెంట్‌ చేశారు. కేరళ సీఎం అభ్యర్థిగా 89 ఏళ్ల శ్రీధరన్‌ను పార్టీ ప్రకటించింది. దీంతో 75 ఏళ్లు పైబడినవారిని వనవాసానికి పంపించాలనే నిర్ణయాన్ని తమకు నచ్చిన రీతిలో మార్చుకున్నట్లు భావించవచ్చా అని స్వామి ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story