ఇకపై అల్లరి చేయను టీచర్‌.. ముద్దు పెట్టి సారీ చెప్పిన బుడ్డోడు..

ఇకపై అల్లరి చేయను టీచర్‌.. ముద్దు పెట్టి సారీ చెప్పిన బుడ్డోడు..

Rama Rao
Published on: 13 Sept 2022 6:33 PM IST
Student Kisses Teacher Viral video | Telugu News
X

ఇకపై అల్లరి చేయను టీచర్‌.. ముద్దు పెట్టి సారీ చెప్పిన బుడ్డోడు..

Viral Video: చిన్నపిల్లల్ని డీల్‌ చేయడమంటే అంత ఈజీ కాదు. చాలా ఓపిక, తెలివి ఉండాలి. పిల్లల్ని మైమరిపించే టెక్నిక్స్‌ ఉంటే తప్ప వారిని మేనేజ్‌ చేయడం కష్టం. క్లాసులో పదే పదే అల్లరి చేస్తున్న ఓ బుడతడిని ఆ క్లాస్‌ టీచర్‌ డీల్‌ చేసిన విధానం అందరినీ ఆకర్షిస్తున్నది. బుడ్డోడా నువ్‌ క్లాసులో బాగా అల్లరి చేస్తున్నావు నీతో కచ్చి అన్నట్లు ఆ టీచర్‌ బుంగమూతి పెట్టుకుంటుంది. నువ్‌ అల్లరి చేస్తున్నావు అని ఆ టీచర్‌ మందలించిన తీరు ఆ చిన్నోడికి నచ్చినట్లుంది. అందుకే వెంటనే నో టీచర్‌ ఇక మీద చేయను.. అల్లరి అసలు చేయను టీచర్‌ సారీ అని టీచర్‌ దగ్గరకు వచ్చి చెబుతాడు. ఐతే టీచర్‌ వెంటనే ఓప్పుకోలేదు. లేదే లేదు నువ్‌ చెస్తున్నావు అని మళ్లీ మళ్లీ అంటుంది.

దానికి ఆ చిన్నోడు కూడా లేదు టీచర్‌ ఇకమీద అల్లరి చేయను అంటూ ఆమెను దగ్గరగా వాటేసుకుని మరీ చెబుతాడు. టీక్‌ హై.. ఏక్‌ కాం కరో.. అంటూ ఆ టీచర్‌ వాడికి ఓ కండిషన్‌ పెడుతుంది. నిన్ను క్షమించాలంటే నాకో ముద్దివ్వు అని అడుగుతుంది. అడిగిందే తడువు వాడు ఆ టీచర్‌ రెండు చెంపలపైన ముద్దు పెడతాడు. ఇదంతా వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్‌ చేశారు. ఇది చూసిన నెటిజనులు ఫుల్‌ ఫీదా అవుతున్నారు. పోస్ట్‌ పెట్టిన కాసేపట్లోనే వీడియో వైరల్‌గా మారింది. మా చిన్నపుడు కూడా ఇలాంటి టీచర్‌ ఉంటే బాగుండు నాకు ముద్దు పెట్టే చాన్స్‌ దొరికేది అని ఒకరు, అరె బుడ్డోడా నువ్‌ చాలా లక్కీ రా.. అంటూ మరోకరు, ఇలా రకరకాల కామెట్లు, లైక్‌లతో వీడియో ఫుల్‌ వైరల్‌గా మారింది.

Rama Rao

Rama Rao

Next Story