Assam: అసోంలో 7 వాహనాలకు నిప్పుపెట్టిన దుండగులు.. ఐదుగురు సజీవదహనం

* దిమా హసవో జిల్లాలోని దియుంగ్బ్రాలో ఘటన

Sandeep Reddy
Updated on: 27 Aug 2021 1:30 PM IST
Strangers Set Fire to 7 Vehicles in Assam
X

అసోంలో 7 వాహనాలకు నిప్పుపెట్టిన దుండగులు (ఫైల్ ఫోటో)

Assam: అసోంలో ఆగంతకుల ఘాతుకానికి ఐదుగురు బలయ్యారు. రాష్ట్రంలోని దిమా హసావో జిల్లా దియుంగ్బ్రాలో ఏడు ట్రక్కులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ట్రక్కుల్లో ఉన్న ఐదుగురు సజీవ దహనమయ్యారు. మంటల్లో ఐదుగురు కాలి చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఇది ఉగ్రవాదుల చర్యగా భావిస్తున్నామని, దీనివెనక దిమాసా నేషనల్‌ లిబరేషన్‌ ఆర్మీ DNLA హస్తమున్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. గురువారం రాత్రి దియుంగ్బ్రాలో ట్రక్‌ డ్రైవర్లు, ఇతరులపై ఆయుధాలతో ఐదుగురు మిలిటెంట్లు కాల్పులు జరిపారని, అనంతరం ఆ ట్రక్కులకు నిప్పంటించారని చెప్పారు. ఈ దాడి వెనక DNLA అనే మిలిటెంట్‌ సంస్థ ఉన్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అస్సామ్‌ రైఫిల్స్‌కు చెందిన భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని చెప్పారు. కాలిపోయిన వాహనాల నుంచి ఐదు మృతదేహాలను వెలికితీశామన్నారు.

మంటల్లో ఐదుగురు కాలి చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఇది ఉగ్రవాదుల చర్యగా భావిస్తున్నామని, దీనివెనక దిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ DNLA హస్తమున్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. గురువారం రాత్రి దియుంగ్బ్రాలో ట్రక్ డ్రైవర్లు, ఇతరులపై ఆయుధాలతో ఐదుగురు మిలిటెంట్లు కాల్పులు జరిపారని, అనంతరం ఆ ట్రక్కులకు నిప్పంటించారని చెప్పారు. ఈ దాడి వెనక DNLA అనే మిలిటెంట్ సంస్థ ఉన్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అస్సామ్ రైఫిల్స్ కు చెందిన భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని చెప్పారు. కాలిపోయిన వాహనాల నుంచి ఐదు మృతదేహాలను వెలికితీశామన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story